విడుదలకు ముందే సేఫ్ జోన్ లో 'తండేల్'!

పాన్ ఇండియా లెవెల్ లో రూపొందే సినిమాలకు ఓటీటీ హక్కులు ఎంతో ప్రధానంగా మారాయి. అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాని విడుదలకు ముందే నెట్‌ఫ్లిక్స్ రూ.250 కోట్లకు కొనుగోలు చేసింది అంటే డిజిటల్ రైట్స్ డిమాండ్ ఏ రేంజులో ఉందో అర్థమవుతుంది.;

By :  S D R
Update: 2025-02-03 12:12 GMT

పాన్ ఇండియా లెవెల్ లో రూపొందే సినిమాలకు ఓటీటీ హక్కులు ఎంతో ప్రధానంగా మారాయి. అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాని విడుదలకు ముందే నెట్‌ఫ్లిక్స్ రూ.250 కోట్లకు కొనుగోలు చేసింది అంటే డిజిటల్ రైట్స్ డిమాండ్ ఏ రేంజులో ఉందో అర్థమవుతుంది. ఇక నాగచైతన్య 'తండేల్' సినిమాని సైతం రూ.35 కోట్లకు దక్కించుకుందట నెట్‌ఫ్లిక్స్.

ఓటీటీ రైట్స్ రూ.35 కోట్లు వస్తే.. శాటిలైట్, ఆడియో, హిందీ డబ్బింగ్ ఇలా మిగతా నాన్‌-థియేట్రికల్ రూపంలో ఈ మూవీకి మరో రూ.25 కోట్లు దక్కినట్టు తెలుస్తోంది. మొత్తంగా విడుదలకు ముందే నాన్‌-థియేట్రికల్ రూపంలో 'తండేల్' చిత్రం రూ.60 కోట్లు దక్కించుకుందనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. అంటే ఈ సినిమా బడ్జెట్ లో దాదాపు 70 శాతం నాన్‌-థియేట్రికల్ ద్వారా రికవర్ అయినట్టే.

'తండేల్' సినిమా సేఫ్‌ ప్రాజెక్ట్ గా మిగలాలంటే థియేట్రికల్ గా కేవలం రూ.25 నుంచి రూ.30 కోట్లు కలెక్ట్ చేస్తే సరిపోతుందట. తొలిరోజు పాజిటివ్ టాక్ వస్తే చాలు వీకెండ్ వరకే 'తండేల్' సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లినట్టే. మొత్తంగా.. భారీ అంచనాలతో నాగచైతన్య 'తండేల్' చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Tags:    

Similar News