'తమ్ముడు' ప్రమోషన్స్ షురూ!

నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘తమ్ముడు’ షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. గత కొన్ని సినిమాలుగా నిరాశ ఎదురైన నితిన్, ఈ చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.;

By :  S D R
Update: 2025-05-11 02:56 GMT

నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘తమ్ముడు’ షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. గత కొన్ని సినిమాలుగా నిరాశ ఎదురైన నితిన్, ఈ చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ఆసక్తిని పెంచగా, మే 12న సాయంత్రం 4.05 గంటలకు ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ అనే స్పెషల్ ట్రీట్ విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో నితిన్ మాస్, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌ను చూపించనున్నట్టు సమాచారం.

ఈ చిత్రంలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శాస్విక కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరోయిన్ లయ ఈ సినిమా ద్వారా తిరిగి తెరపైకి రాబోతోంది. 'కాంతార, విరూపాక్ష' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. జూలై 4న 'తమ్ముడు' గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ టైటిల్ తో రాబోతున్న 'తమ్ముడు' నితిన్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.




Tags:    

Similar News