10 రోజుల్లో 10 కిలోలు తగ్గిన సింబు
వెట్రిమారన్‌తో తన నెక్స్ట్ ఫిల్మ్ కోసం కేవలం 10 రోజుల్లో 10 కిలోల బరువు తగ్గి అందరినీ షాక్‌లో ముంచెత్తాడు సింబు.;
తమిళ స్టార్ హీరో సింబు మళ్లీ తన మార్క్ చూపించాడు. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్‌గా గేమ్‌ను ఛేంజ్ చేశాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్.. దర్శకుడు వెట్రిమారన్‌తో తన నెక్స్ట్ ఫిల్మ్ కోసం కేవలం 10 రోజుల్లో 10 కిలోల బరువు తగ్గి అందరినీ షాక్‌లో ముంచెత్తాడు. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అంతా సైలెంట్‌గా జరిగిపోయింది. కానీ ఇప్పుడు దాని గురించే ఎక్కడ చూసినా టాక్. సింబు ఇలాంటి డెడికేషన్‌ను గతంలో చూపించినా, ఈసారి మార్పు అందరి దృష్టినీ లాగేసింది.
మొదట్లో ఈ మూవీ ‘వడచెన్నై 2’ అని సోషల్ మీడియాలో ఓ రూమర్ బాగా స్ప్రెడ్ అయింది. కానీ వెట్రిమారన్ ఆ గుసగుసలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఇది దానికి సీక్వెల్ కాదు.. అని క్లియర్‌గా చెప్పేశాడు. ఈ ఫిల్మ్ ‘వడచెన్నై’ వరల్డ్‌లోనే సెట్ చేశారు. అదే నార్త్ చెన్నై వైబ్, అదే రా అండ్ రస్టిక్ ఫీల్. కానీ స్టోరీ టోటల్‌గా డిఫరెంట్. ‘వడచెన్నై’ రైట్స్ ఇప్పటికీ ధనుష్ దగ్గరే ఉన్నాయి. సో ఈ కొత్త ప్రాజెక్ట్ సింబుతో సెపరేట్‌గా, స్వతంత్రంగా రూపొందుతోంది. అయినా, ఈ మూవీలో కూడా అదే గట్సీ, గ్రిట్టీ టోన్ ఉంటుంది. ఇక సింబు ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చూస్తే ఈ రోల్ సీరియస్‌గా డిమాండింగ్ అని అర్థమవుతోంది.
టీజర్ షూట్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. షూటింగ్ క్రూ నుంచి ఒక మెంబర్ కన్ఫర్మ్ చేశాడు. సింబు తన పార్ట్‌ను కంప్లీట్ చేసేశాడని, టీజర్ త్వరలో రిలీజ్ అవుతుందని. ఈ ఫిల్మ్‌లో సింబు లుక్ ఆ క్యారెక్టర్‌ను యంగర్ వెర్షన్‌లో చూపించేలా డిజైన్ చేశారు, అందుకే ఈ ర్యాపిడ్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఇంత తక్కువ టైమ్‌లో ఇంత పెద్ద మార్పు తెచ్చుకోవడం అంటే, సింబు డెడికేషన్‌ను హ్యాట్సాఫ్ చెప్పాలి. మరి వెట్రిమారన్ ఈ కథను ఎలా హ్యాండిల్ చేస్తాడనేది చూడాలని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు.