సూర్యకు మరోసారి పరీక్షా సమయం
సినిమాల పరంగా గత కొంతకాలంగా తడబడుతున్నా, సూర్యపై ప్రేక్షకుల్లోని అభిమానం మాత్రం అలాగే ఉంది.;
సినిమాల పరంగా గత కొంతకాలంగా తడబడుతున్నా, సూర్యపై ప్రేక్షకుల్లోని అభిమానం మాత్రం అలాగే ఉంది. నటనతో పాటు ఆయన మానవత్వం, అగరం ఫౌండేషన్ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు, సూర్యని ఎంతోమందికి అభిమాన నటుడిగా మార్చాయి. ఇక సూర్య తన గత చిత్రం 'కంగువా'పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అంతకుముందు ఎన్నో విజయాలందించిన శివకు ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఫలితం నిరాశ కలిగించింది.
లేటెస్ట్ గా కార్తీక్ సుబ్బరాజ్ తో చేసిన 'రెట్రో'కి మిశ్రమ ఫలితం వచ్చింది. 'రెట్రో' విషయంలోనూ సూర్య మరోసారి డైరెక్టర్‌ను నమ్మాడు. కానీ పాత హిట్ల మిశ్రమంగా అనిపించిన కథ, బలహీనమైన స్క్రీన్‌ప్లేతో ఇదొక రొటీన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా మిగిలిపోయింది.
ఇప్పుడు సూర్య అభిమానుల ఆశలు రెండు ప్రాజెక్టులపైనే ఉన్నాయి. వాటిలో ఒకటి ఆర్.జె. బాలాజీ తెరకెక్కిస్తున్న సూర్య 45, ఇంకొకటి వెంకీ అట్లూరి డైరెక్షన్‌లోని వింటేజ్ డ్రామా. మరి.. అప్‌కమింగ్ మూవీస్ తో సూర్య మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.