‘తండేల్‘ ట్రైలర్.. తన మంది కోసం నిలబడే లీడర్!
‘తండేల్‘ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు మోస్ట్ అవైటింగ్ ట్రైలర్ రిలీజయ్యింది. ఆద్యంతం మత్సకారుల ఇతివృత్తంతో శ్రీకాకుళంలో నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు చందూ మొండేటి.;
అక్కినేని ఫ్యామిలీలో స్టెడీ హిట్స్ తో దూసుకెళ్లే హీరోగా నాగచైతన్యకు పేరుంది. అయితే చైతన్య నటించిన గత మూడు సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ‘బంగార్రాజు‘ హిట్ తర్వాత ‘థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ‘ ఫ్లాపులుగా మిగిలాయి. దీంతో నాగచైతన్య ఆశలన్నీ ‘తండేల్‘ చిత్రంపైనే పెట్టుకున్నాడు. నాగ చైతన్య-చందూ మొండేటి, చైతన్య-సాయి పల్లవి, చైతూ - గీతా ఆర్ట్స్ ఇలా పలు సూపర్ హిట్ కాంబినేషన్స్ లో ‘తండేల్‘ సినిమా వస్తోంది. అందుకే ఈ మూవీ ష్యూర్ షాట్ హిట్ అని అక్కినేని అభిమానులు నమ్ముతున్నారు.
‘తండేల్‘ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు మోస్ట్ అవైటింగ్ ట్రైలర్ రిలీజయ్యింది. ఆద్యంతం మత్సకారుల ఇతివృత్తంతో శ్రీకాకుళంలో నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు చందూ మొండేటి. అక్కడ జరిగిన ఓ యదార్థ సంఘటన ఈ సినిమాకి ప్రేరణ. ట్రైలర్ విషయానికొస్తే.. ఇందులో రాజు (నాగ చైతన్య), సత్య (సాయి పల్లవి) ప్రేమకథను హైలైట్ చేశారు. వీరిద్దరి మధ్య లవ్ ఎపిసోడ్స్, శ్రీకాకుళం యాసలో వారు చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఆ తర్వాత చేపల వేట కోసం రాజు సముద్రం లోకి వెళ్లడం.. అనుకోని రీతిలో పాకిస్తాన్ కు చిక్కడం.. చివరకు పాకిస్తాన్ చెర నుంచి రాజు తిరిగొచ్చాడా? ప్రియురాలని కలుసుకున్నాడా? వంటివి ఆసక్తికరంగా ఉండబోతున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. మొత్తంగా.. ప్రేమ, దేశభక్తి వంటి అంశాలతో రస్టిక్ రొమాంటిక్ థ్రిల్లర్ గా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘తండేల్‘.