సూర్య డబుల్ ధమాకా!
కోలీవుడ్ స్టార్ సూర్య తెలుగులో నటిస్తున్న స్ట్రెయిట్ మూవీ ఇటీవలే ప్రారంభమైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కోసం వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ ప్రారంభం కాబోతుంది.;
కోలీవుడ్ స్టార్ సూర్య తెలుగులో నటిస్తున్న స్ట్రెయిట్ మూవీ ఇటీవలే ప్రారంభమైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కోసం వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ ప్రారంభం కాబోతుంది.
వెంకీ అట్లూరి ఇప్పటివరకు మెలోడి, క్లాస్ ఫీల్ ఉన్న ప్రేమ కథలతో సక్సెస్ సాధించిన దర్శకుడు. అలాగే 'లక్కీ భాస్కర్' వంటి డిఫరెంట్ స్టోరీని డైరెక్ట్ చేశాడు. అయితే ఈసారి సూర్య వంటి మల్టీ-డైమెన్షనల్ కమర్షియల్ హీరో దొరకడంతో అతనికోసం ఓ మాస్ మిస్టరీ థ్రిల్లర్ ను తీర్చిదిద్దాడట.
ఈ మూవీలో సూర్య డ్యూయెల్ రోల్ లో చేస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. ఈ రెండు క్యారెక్టర్స్ లో ఒకటి నెగటివ్ రోల్ అట. ఈ మూవీలో సూర్యకి జోడీగా మమిత బైజు నటిస్తుంది. మరో నాయిక కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇక వరుసగా వెంకీ అట్లూరితో సినిమాలు చేస్తున్న జి.వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మొత్తంగా.. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న సూర్యకి వెంకీ అట్లూరి ఎలాంటి హిట్ అందిస్తాడో చూడాలి.