సూర్య - వెంకీ అట్లూరి కాంబో కి అంత బడ్జెట్టా?
'సార్', 'లక్కీ భాస్కర్' వంటి చిత్రాలతో ఎంతో ప్రభావాన్ని చూపించాడు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి.;
'సార్', 'లక్కీ భాస్కర్' వంటి చిత్రాలతో ఎంతో ప్రభావాన్ని చూపించాడు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి. ఈ నేపథ్యం లో ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్యతో ఓ ఆసక్తికరమైన చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ‘లక్కీ భాస్కర్’ సినిమా సూర్యకు బాగా నచ్చడం తో వెంటనే తన అంగీకారం తెలియజేశాడు. ఈ చిత్రం జూన్ నుండి షూటింగ్ ప్రారంభించనుంది. ఈ మేరకు చిత్ర బృందం ఇటీవల అధికారికంగా ప్రకటించింది.
ఈ చిత్రం దాదాపు రూ.120 కోట్లు బడ్జెట్‌తో రూపొందనుండగా.. సూర్య రూ.50 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారు. ఇది సూర్య గత ట్రాక్ రికార్డు దృష్ట్యా ఎంతో భారీ బడ్జెట్ అని చెప్పొచ్చు. కొంతకాలంగా సూర్యకి పెద్ద విజయం లభించకపోయినా, అతడు భారతీయ సినీ రంగంలో బెస్ట్ హీరోల్లో ఒకడు కాబట్టి నిర్మాతలు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధ మవుతున్నారు.
అలాగే, సూర్య చాలాకాలంగా ఒక స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ భారీ ప్రాజెక్టును నిర్మించనుండగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించనున్నాడు. ప్రస్తుతానికి నటీనటులు, సాంకేతిక బృందాన్ని తుదిశైలిలో ఎంపిక చేస్తుండగా, త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.