సుమంత్ సొషియో ఫాంటసీ

టాలీవుడ్‌లో ఫీల్ గుడ్ కథాచిత్రాలకు పరిమితమవుతూ తనదైన ముద్ర వేసుకున్న హీరో సుమంత్, ఇప్పుడు ఓ విభిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'మహేంద్రగిరి వారాహి' అనే ఆసక్తికర టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి స్థాయి సోషియో ఫాంటసీగా రాబోతోంది.;

By :  S D R
Update: 2025-05-17 03:11 GMT

టాలీవుడ్‌లో ఫీల్ గుడ్ కథాచిత్రాలకు పరిమితమవుతూ తనదైన ముద్ర వేసుకున్న హీరో సుమంత్, ఇప్పుడు ఓ విభిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'మహేంద్రగిరి వారాహి' అనే ఆసక్తికర టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి స్థాయి సోషియో ఫాంటసీగా రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు సుమంత్ తాజాగా ప్రారంభించాడు.

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగా సినిమా విడుదలలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నప్పటికీ, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ సన్నాహాలు చేస్తోంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి కథానాయికగా నటిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇటీవల ఈటీవి విన్ వేదికగా విడుదలైన సుమంత్ 'అనగనగా'కి అంతటా ప్రశంసలు దక్కుతున్నాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మెస్సేజ్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకి సెలబ్రిటీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Tags:    

Similar News