‘స్టోరీ బిహైండ్ ది మేకింగ్‘ ఆఫ్ ‘తండేల్‘!
వాస్తవ సంఘటనలతో రూపొందే సినిమాలలో ఓ లైఫ్ ఉంటుంది. ‘తండేల్‘ సినిమా విషయంలోనూ అదే మ్యాజిక్ జరుగుతుందని భావిస్తోంది టీమ్. శ్రీకాకుళానికి చెందిన ఓ జాలరి కథను ప్రేరణగా తీసుకుని చందూ మొండేటి ఈ సినిమాని తెరకెక్కించాడు.;
వాస్తవ సంఘటనలతో రూపొందే సినిమాలలో ఓ లైఫ్ ఉంటుంది. ‘తండేల్‘ సినిమా విషయంలోనూ అదే మ్యాజిక్ జరుగుతుందని భావిస్తోంది టీమ్. శ్రీకాకుళానికి చెందిన ఓ జాలరి కథను ప్రేరణగా తీసుకుని చందూ మొండేటి ఈ సినిమాని తెరకెక్కించాడు.వాస్తవ సంఘటనలతో రూపొందే సినిమాలలో ఓ లైఫ్ ఉంటుంది. ‘తండేల్‘ సినిమా విషయంలోనూ అదే మ్యాజిక్ జరుగుతుందని భావిస్తోంది టీమ్. శ్రీకాకుళానికి చెందిన ఓ జాలరి కథను ప్రేరణగా తీసుకుని చందూ మొండేటి ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ మూవీలో రాజు పాత్రలో జాలరిగా నాగచైతన్య నటించాడు. జాలరిగా మారడం కోసం చైతన్య ఎలాంటి కసరత్తులు చేశాడు. తన మేకోవర్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? అనేది ఎంతో ఆసక్తికరం.
నాగచైతన్య, సాయిపల్లవి అంతకుముందే ‘లవ్ స్టోరీ‘ చిత్రంలో నటించి మెప్పించారు. ఇప్పుడు ‘తండేల్‘ కోసం వీరిద్దరూ రెండోసారి జోడీ కట్టారు. ఈ మూవీలోని చైతూ, సాయి పల్లవి మధ్య లవ్ స్టోరీ ఎంతో హైలైట్ అవుతుందంటున్నారు మేకర్స్. దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ మూవీకి మరో ప్లస్ అని భావిస్తోంది టీమ్. ఫిబ్రవరి 7న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోన్న ‘తండేల్‘ మూవీ మేకింగ్ కి సంబంధించి పలు ఆసక్తికర విశేషాలను తెలియజేస్తూ అన్ స్క్రిప్టెడ్ వీడియోని రిలీజ్ చేసింది టీమ్.