స్టార్ బాయ్ సిద్ధు వాలెంటైన్స్ డే ట్రీట్!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా కొత్త సినిమాలు థియేటర్లకు క్యూ కడుతుంటాయి. ముఖ్యంగా ప్రేమికులరోజు కానుకగా ప్రేమకథా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటారు మేకర్స్. ఈ వాలెంటైన్స్ డే స్పెషల్ గా విశ్వక్ సేన్ 'లైలా', కిరణ్ అబ్బవరం 'దిల్ రూబా', బ్రహ్మానందం 'బ్రహ్మ ఆనందం' సినిమాలున్నాయి.;

By :  S D R
Update: 2025-02-05 00:17 GMT

వాలెంటైన్స్ డే స్పెషల్ గా కొత్త సినిమాలు థియేటర్లకు క్యూ కడుతుంటాయి. ముఖ్యంగా ప్రేమికులరోజు కానుకగా ప్రేమకథా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటారు మేకర్స్. ఈ వాలెంటైన్స్ డే స్పెషల్ గా విశ్వక్ సేన్ 'లైలా', కిరణ్ అబ్బవరం 'దిల్ రూబా', బ్రహ్మానందం 'బ్రహ్మ ఆనందం' సినిమాలున్నాయి.


ఇదే వాలెంటైన్స్ కి స్టార్ బాయ్ సిద్ధు నటించిన 'కృష్ణ అండ్ హిస్ లీల' కూడా సరికొత్తగా థియేటర్లలోకి వస్తోంది. 'ఇట్స్ కాంప్లికేటెడ్' అనే టైటిల్ తో ఈ సినిమాని ఫిబ్రవరి 14న రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో సిద్ధుకి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలిని నటించారు. 'కృష్ణ అండ్ హిస్ లీల' 2020, జూన్ లో డైరెక్ట్ ఓటీటీలో రిలీజయ్యింది.


అప్పటికే ట్రెండీ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌.. ఇప్పటికీ ఆడియన్స్ ను అలరిస్తుందనే నమ్మకంతో 'ఇట్స్ కాంప్లికేటెడ్'గా థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. లేటెస్ట్ గా 'ఇట్స్ కాంప్లికేటెడ్' ట్రైలర్ రిలీజయ్యింది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఈ వాలెంటైన్స్ డే కి సిద్ధు గట్టిగా కొట్టేటట్టే ఉన్నాడు. ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి నిర్మించడం విశేషం.


Tags:    

Similar News