త్రివేణి సంగమంలో శ్రీనిధి శెట్టి పవిత్ర స్నానం
కేజీఎఫ్ ఫ్రాంచైజీలో నటించి మంచి పేరు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. నాని నటిస్తున్న "HIT 3", సిద్ధూ జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న "తెలుసు కదా" సినిమాలతో శరవేగంగా షూటింగ్ కొనసాగుతున్న ఆమె తాజాగా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసింది.
ఈ యాత్ర గురించి శ్రీనిధి తన అనుభూతులను పంచుకుంటూ... "ఇది అసలు నా ప్లాన్‌లో లేదు. నాకు తెలియకుండా ప్రయాగ్ నన్ను పిలిచినట్లు అనిపించింది. ఉండగా, ఒక్కొక్కటి జరిగి, అనుకోకుండా విమానాలు బుక్ చేసుకుని, బ్యాగ్ ప్యాక్ చేసి, మిలియన్ల మందిలో మార్గం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను" అని చెప్పింది.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళా సందర్భంగా గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంలో పవిత్ర స్నానం చేసిన అనంతరం, తన అనుభూతిని ఫొటోలు పంచుకుంటూ, "ఈ ఆధ్యాత్మిక అనుభూతి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం" అని.
ఈ ప్రయాణంలో శ్రీనిధి తండ్రి కూడా ఆమెతో కలిసి ఉన్నారు. "నా డాడీ ఎప్పుడూ నా చివరి నిమిషం ప్లాన్‌లను అంగీకరిస్తున్నారు. కానీ ఇది చాలా అరుదైన అవకాశం. అందుకే ఎలాంటి ప్రశ్నలూ లేకుండా ప్రయాణాన్ని మేమిద్దరం కలసి అనుభవించాం" అని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.