బాలకృష్ణ బీఎండబ్ల్యూకి ప్రత్యేక గుర్తింపు!

కథానాయకుడిగా, రాజకీయ నాయకుడిగా తన విలక్షణతను చూపించే నటసింహం బాలకృష్ణ.. ఇప్పుడు తన కారుకి కూడా ప్రత్యేకతను చూపించారు.;

By :  S D R
Update: 2025-04-20 03:51 GMT

కథానాయకుడిగా, రాజకీయ నాయకుడిగా తన విలక్షణతను చూపించే నటసింహం బాలకృష్ణ.. ఇప్పుడు తన కారుకి కూడా ప్రత్యేకతను చూపించారు. తాజాగా హైదరాబాద్ ఖైరతాబాద్ RTA కార్యాలయంలో జరిగిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఆయన "TG09F0001" నంబరును రూ. 7.75 లక్షలు చెల్లించి దక్కించుకున్నారు. త్వరలో రిజిస్ట్రేషన్ చేయబోయే BMW వాహనానికి ఈ నంబర్‌ను తీసుకున్నారు బాలయ్య.

ఈ వేలంలో ఖైరతాబాద్ జోన్‌కి ఒక్కరోజులోనే రవాణా శాఖకు రూ. 37.15 లక్షల ఆదాయం సమకూరింది. బాలకృష్ణ దక్కించుకున్న నంబర్‌తో పాటు, మరికొన్ని ఫ్యాన్సీ నంబర్లు కూడా భారీ రేట్లకు అమ్ముడయ్యాయి. ప్రభుత్వ ఆదాయానికి తోడు, ఫ్యాన్సీ నంబర్ల పట్ల సెలెబ్రిటీల ఆసక్తి మరోసారి స్పష్టమైంది. బాలయ్య లాంటి స్టార్‌లు ఎంపిక చేసుకునే నంబర్లు ఆయా వాహనాలకు కొత్త గుర్తింపు తీసుకువస్తున్నాయి.

Tags:    

Similar News