ఆకట్టుకుంటున్న సునీల్ , కబీర్ దుహన్ సింగ్
మార్కో’ సూపర్ హిట్ సినిమా తర్వాత క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షెరీఫ్ ముహమ్మద్ నిర్మిస్తున్న చిత్రం ‘కాట్టాలన్’. ఈ చిత్రంలో టాలీవుడ్ యాక్టర్ సునీల్, విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ అయిన కబీర్ దుహాన్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.;
మార్కో’ సూపర్ హిట్ సినిమా తర్వాత క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షెరీఫ్ ముహమ్మద్ నిర్మిస్తున్న చిత్రం ‘కాట్టాలన్’. ఈ చిత్రంలో టాలీవుడ్ యాక్టర్ సునీల్, విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ అయిన కబీర్ దుహాన్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సరికొత్త దర్శకుడు పాల్ జార్జ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘పుష్ప’, ‘జైలర్’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘అల వైకుంఠపురములో’, ‘మావీరన్’, ‘మార్క్ ఆంటోనీ’, వంటి అనేక చిత్రాల్లో అద్భుతమైన నటనతో మెప్పించిన సునీల్.. మమ్ముట్టి ‘టర్బో’ చిత్రం ద్వారా మలయాళంలో అడుగుపెట్టాడు.
‘మార్కో’ చిత్రం ద్వారా మలయాళంలో అరంగేట్రం చేశాడు కబీర్ దుహన్ సింగ్. ఈ చిత్రంలోని ప్రదర్శనతో ‘మోస్ట్ బ్రూటలిస్టిక్ విలన్’గా గుర్తింపు పొందాడు. తమిళంలో ‘వేతాళం’, ‘కాంచన 3’ వంటి చిత్రాల్లో కబీర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ‘కాట్టాలన్’లో కబీర్ అండ్ సునీల్ సరికొత్త మేకోవర్‌తో కనిపించనుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలను ప్రపంచ ప్రఖ్యాత స్టంట్ కొరియోగ్రాఫర్ కెచ్చ కెంబడికే రూపొందిస్తున్నట్లు సమాచారం.