'సింగిల్' సెన్సార్ కంప్లీట్!
శ్రీవిష్ణు తాజా చిత్రం ‘సింగిల్’ ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. కార్తిక్ రాజు దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రాబోతుంది.;
శ్రీవిష్ణు తాజా చిత్రం ‘సింగిల్’ ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. కార్తిక్ రాజు దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రాబోతుంది. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ దక్కింది.
'సింగిల్' మూవీ ట్రైలర్ తర్వాత కొన్ని కాంట్రవర్సీలు వచ్చాయి. ఈ ట్రైలర్ లో 'కన్నప్ప' చిత్రాన్ని ట్రోల్ చేసే విధంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని విష్ణు తరపు వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత 'సింగిల్' టీమ్ వారికి క్షమాపణలు చెప్పడంతో అది సద్దుమణిగింది.
లేటెస్ట్ గా 'సింగిల్' సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ముఖ్యంగా, ఈ చిత్రం రన్‌టైమ్‌ను 2 గంటల 10 నిమిషాలుగా ఖరారు చేశారు. షార్ప్ రన్‌టైమ్ తో వస్తోన్న ఈ మూవీ శ్రీవిష్ణు ట్రేడ్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆడియన్స్‌ను అలరిస్తుందనే నమ్మకంతో ఉంది టీమ్.
ఈ సినిమాలో శ్రీవిష్ణుకి జోడీగా కేతిక శర్మ, ఇవానా నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చాడు. గీతా ఆర్ట్స్ 2 పై అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భానుప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ సినిమా మే 9న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.