మధ్య తరగతి కథతో వస్తోన్న సిద్ధార్థ్!

హిట్, ఫ్లాప్ లను లెక్కచేయకుండా కంటెంట్‌కి ప్రాధాన్యత ఇచ్చే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్ధార్థ్. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథాంశాలతో సినిమాలు ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తోన్న సిద్ధు తాజాగా ‘3BHK’ అనే ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్నాడు.;

By :  S D R
Update: 2025-02-05 15:32 GMT

కొంతమంది నటులు కొన్ని తరహా పాత్రలకు పర్ఫెక్ట్ గా సూటవుతారు. ఈకోవలోనే పక్కింటబ్బాయి తరహా పాత్రలకు సరిగ్గా సరిపోయే నటుడు సిద్ధార్థ్. హిట్, ఫ్లాప్ లను లెక్కచేయకుండా కంటెంట్‌కి ప్రాధాన్యత ఇచ్చే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్ధార్థ్. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథాంశాలతో సినిమాలు ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తోన్న సిద్ధు తాజాగా ‘3BHK’ అనే ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్నాడు.


శ్రీ గణేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రతి మధ్య తరగతి కుటుంబంలో జరిగే సజీవ కథనాన్ని తెరపై ఆవిష్కరించబోతుందట. తాజాగా ఈ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. ఒక సాధారణ కుటుంబ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఓ గుమాస్తా తండ్రి, ఇంటిని గమనించే తల్లి, వారి పిల్లల కలలు, జీవిత పోరాటాలు చూపించబోతున్నట్లు టైటిల్ టీజర్ స్పష్టం చేస్తుంది.


ఈ సినిమాలో సిద్ధార్థ్ తల్లిదండ్రుల పాత్రల్లో శరత్ కుమార్, దేవయాని నటిస్తుంటే.. మిగతా పాత్రల్లో మీతా రఘునాథ్, చైత్ర, యోగిబాబు కనిపించబోతున్నారు. కుటుంబ భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరించే ఈ సినిమాకు అమ్రిత్ రామ్‌నాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అర్జున్ విశ్వ నిర్మాణంలో రూపొందుతున్న ‘3BHK’ ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.


Full View


Tags:    

Similar News