ఓటీటీ లోకి సిద్ధార్థ్ ‘3బీహెచ్కే’ మూవీ
ప్రస్తుత బజ్ ప్రకారం... ‘3బీహెచ్కే’ ఈ చిత్రం ఆగస్టు 1, 2025 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.;
సిద్ధార్థ్ నటించిన తాజా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘3బీహెచ్కే’. శ్రీ గణేష్ దర్శకత్వంలో తమిళ ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అయ్యింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో సాధారణ స్పందననే సొంతం చేసుకుంది. ప్రాంతాల వారీగా మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఈ సినిమా తన హార్ట్ టచింగ్ కథనం, నటనలతో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ విడుదలకు సిద్ధమవుతోంది.
ప్రస్తుత బజ్ ప్రకారం... ‘3బీహెచ్కే’ ఈ చిత్రం ఆగస్టు 1, 2025 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇది తెలుగుతో సహా బహుళ భాషల్లో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ప్లాన్ ప్రకారం జరిగితే, ఈ సినిమా ఓటీటీ లో మరింత విస్తృత ప్రేక్షకాదరణ పొందే అవకాశం ఉంది. చైత్ర జే. ఆచార్ కథానాయికగా నటించగా, ఆర్. శరత్‌కుమార్ సిద్ధార్థ్ తండ్రిగా కనిపించారు. దేవయాని, యోగి బాబు, వివేక్ ప్రసన్నలు కూడా తారాగణంలో ఉన్నారు. ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ నిర్మించగా, అమృత్ రామ్‌నాథ్ సంగీతం సమకూర్చారు.