సెప్టెంబర్ 5.. సమ్‌థింగ్ స్పెషల్!
ఈ ఏడాది ఫస్టాఫ్ లో బాక్సాఫీస్ వద్ద భారీ క్లాషెస్ అనేవి పెద్దగా లేవు. కానీ సెకండాఫ్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ వరుస సినిమాలతో కళకళలాడుతోంది.;
ఈ ఏడాది ఫస్టాఫ్ లో బాక్సాఫీస్ వద్ద భారీ క్లాషెస్ అనేవి పెద్దగా లేవు. కానీ సెకండాఫ్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ వరుస సినిమాలతో కళకళలాడుతోంది. కొన్ని సందర్భాల్లో ఒకే వారం రెండు, మూడు లేదా అంతకు మించిన సినిమాలు బాక్సాఫీస్ పోరుకు సిద్ధమవుతున్నాయి. అలాంటి ఒక డేట్ సెప్టెంబర్ 5.
సాధారణంగా ఈ తేదీ తెలుగు సినీ వర్గాలకు పెద్దగా ప్రత్యేకత లేదు. కానీ 2025లో మాత్రం ఈ డేట్‌కు అనూహ్యమైన హైప్ ఏర్పడుతోంది. కారణం ఏంటంటే సెప్టెంబర్ 5న ఏకంగా మూడు తెలుగు స్ట్రెయిట్ మూవీస్, రెండు డబ్బింగ్ చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
అందాల తార అనుష్క 'ఘాటి' సినిమా ఈనెలలోనే రిలీజవ్వాల్సి ఉంది. అయితే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వని కారణంగా పోస్ట్ పోన్ అయ్యింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న రిలీజ్ చేయాలని భావిస్తోందట టీమ్. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
సెప్టెంబర్ 5న ఇప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న మూవీ 'మిరాయ్'. 'హనుమాన్'తో సూపర్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న తేజా సజ్జ నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా కనిపిస్తుండటం విశేషం. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా కార్తీక్ ఘట్టమనేని 'మిరాయ్'ని తెరకెక్కిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.
ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రలో ఈ సినిమా రూపొందుతోంది. లవ్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. ఇందులో రష్మికకి జోడీగా దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలతో 'ది గర్ల్‌ఫ్రెండ్'పై మంచి బజ్ ఏర్పడింది.
సెప్టెంబర్ 5నే శివకార్తికేయన్, మురుగదాస్ కాంబోలో రూపొందుతున్న 'మదరాసి' రాబోతుంది. 'అమరన్' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత శివ కార్తికేయన్ నుంచి వస్తోన్న సినిమా ఇది. అలాగే.. డైరెక్టర్ మురుగదాస్ కు తెలుగులో మంచి క్రేజుంది. ఈ ఇద్దరి కలయికలో వస్తోన్న సినిమా కావడంతో.. తెలుగులో స్ట్రెయిట్ మూవీస్ కి ధీటుగా 'మదరాసి'కి మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశాలున్నాయి.
ఇంకా.. సెప్టెంబర్ 5నే విజయ్ ఆంటోని 'భద్రకాళి' రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తుంది. మొత్తంగా.. ఆగస్టు 14న 'వార్ 2, కూలీ' తర్వాత మళ్లీ సెప్టెంబర్ 5న టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బడా బాక్సాఫీస్ క్లాష్ జరగబోతుందన్నమాట.