సీఎం ను కలిసిన సందీప్ రెడ్డి

సందీప్ రెడ్డి వంగా తన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా తో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని సీఎం కార్యాలయంలో కలిశారు.;

By :  S D R
Update: 2025-08-29 23:13 GMT

సందీప్ రెడ్డి వంగా తన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా తో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని సీఎం కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున సీఎం సహాయనిధికి రూ.10 లక్షల విరాళం అందజేశారు.

ఈ విరాళం అందజేస్తూ, 'భద్రకాళి ప్రొడక్షన్స్ తరఫున ఇది మా సామాజిక బాధ్యతలో భాగం. ప్రజల సంక్షేమం కోసం సీఎం సహాయనిధి చేస్తున్న కృషికి తమవంతుగా చిన్న బహుమానాన్ని అందిస్తున్నాం' అని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలిపారు.

సీఎం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో సాగింది. సినీ రంగానికి చెందిన ప్రముఖులు సామాజిక అంశాల్లో కూడా ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ వంటి భారీ విజయాలు సాధించిన చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సందీప్ రెడ్డి వంగా, తెలుగు సినిమా నుంచి వెలువడిన ప్రతిభావంతులైన దర్శకుల్లో ఒకరుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో 'స్పిరిట్' సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు సందీప్.



Tags:    

Similar News