కొత్త ప్రాజెక్ట్ కు కమిట్ అయిన పవన్ కళ్యాణ్?
కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వెంకట నారాయణ ఇటీవల పవన్‌తో సమావేశమై, ఓ స్టార్ తమిళ డైరెక్టర్ రూపొందించబోయే ప్రాజెక్ట్ గురించి చర్చించారని సమాచారం.;
కన్నడ ఫిల్మ్ సర్కిల్స్‌లో లేటెస్ట్ బజ్ ప్రకారం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి సెప్టెంబర్ 2న ఆయన బర్త్‌డే సందర్భంగా స్పెషల్ ట్రీట్ రాబోతోంది. టాక్ ఏంటంటే.. పవన్ కళ్యాణ్ సాండల్‌వుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కె. వెంకట నారాయణతో ఓ కొత్త ప్రాజెక్ట్‌కి కమిట్ అయ్యారట. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వెంకట నారాయణ ఇటీవల పవన్‌తో సమావేశమై, ఓ స్టార్ తమిళ డైరెక్టర్ రూపొందించబోయే ప్రాజెక్ట్ గురించి చర్చించారని సమాచారం.
పవన్ ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, సెప్టెంబర్ 2న పవన్ బర్త్‌డే రోజున ఈ క్రేజీ కాంబో గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది.
మరోవైపు, కె. వెంకట నారాయణ విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’, యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’, చిరంజీవి- బాబీ కాంబో మూవీస్ తో పాటు మరికొన్ని భారీ బడ్జెట్ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు.