బాలయ్యకు రజనీ స్పెషల్ విషెస్
నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.;
నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్య ఒక పాజిటివ్ శక్తి అని, ఆయన ఉన్నచోట సంతోషం, నవ్వులు వెల్లివిరుస్తాయని కొనియాడారు.
'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు, కత్తితో కాదురా కంటి చూపుతో చంపేస్తా' వంటి పవర్‌ఫుల్ డైలాగులు కేవలం బాలయ్య నోటే బాగుంటాయని రజనీకాంత్ అన్నారు. బాలకృష్ణకు పోటీ ఆయనేనని, ఆయన సినిమాలు అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులనూ థియేటర్లకు రప్పిస్తాయని తెలిపారు.
50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తిచేసుకున్న బాలకృష్ణ మరో 25 ఏళ్లు నటిస్తూ 75 ఏళ్ల మైలురాయిని చేరుకోవాలని కోరుతూ 'లవ్యూ బాలయ్య' అంటూ రజనీకాంత్ తన సందేశాన్ని ముగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.