'ఉస్తాద్' సాలిడ్ అప్డేట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా అభిమానులకు జాతర ముందుగానే మొదలైంది. పవన్–హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ మాస్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి మేకర్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా అభిమానులకు జాతర ముందుగానే మొదలైంది. పవన్–హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ మాస్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి మేకర్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ నెలకొనగా, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్డేట్‌పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. రేపు (సెప్టెంబర్ 1) సాయంత్రం 4:45 గంటలకు సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 'రేపు ఫుల్ మీల్స్' అంటూ యూనిట్ చేసిన ప్రకటనతో అభిమానుల్లో ఎక్సైట్మెంట్ మరింత పెరిగిపోయింది.
‘గబ్బర్ సింగ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పవన్–హరీష్ కాంబినేషన్ నుంచి వస్తోన్న రెండో చిత్రం కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై ఫ్యాన్స్‌లో క్రేజ్ మరింత ఎక్కువైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కొత్త ఏడాదిలో థియేటర్లలో విడుదల కానుంది.