హ్యాపీ బర్త్‌డే చినబాబు

టాలీవుడ్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌కి ఈరోజు ఉన్న స్థానం వెనుక నిలిచింది ఒకే ఒక్క పేరు – సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు. రిస్క్‌కి రెడీగా, ప్యాషన్‌తో సినిమాలను నిర్మిస్తూ, క్వాలిటీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు ఆయన బ్రాండ్‌ అయ్యారు.;

By :  S D R
Update: 2025-08-31 05:32 GMT

టాలీవుడ్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌కి ఈరోజు ఉన్న స్థానం వెనుక నిలిచింది ఒకే ఒక్క పేరు – సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు. రిస్క్‌కి రెడీగా, ప్యాషన్‌తో సినిమాలను నిర్మిస్తూ, క్వాలిటీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు ఆయన బ్రాండ్‌ అయ్యారు.

1988లో 'ఆత్మకథ'తో మొదలైన చినబాబు ప్రయాణం, త్రివిక్రమ్‌తో కలసి చేసిన 'జులాయి'తో తిరుగులేని విజయయాత్రగా మారింది. ఆ తర్వాత వచ్చిన 'సన్నాఫ్ సత్యమూర్తి, అ ఆ, అరవింద సమేత, అల.. వైకుంఠపురములో' వంటి బ్లాక్‌బస్టర్స్ హారిక హాసిని పేరును నంబర్ వన్ బ్యానర్‌గా నిలబెట్టాయి.

చినబాబు-త్రివిక్రమ్ బంధం కేవలం సినిమాలకే పరిమితం కాకుండా నిజమైన స్నేహానికి ప్రతీకగా నిలుస్తోంది. వీరి కాంబినేషన్‌లో వచ్చే ప్రతి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. తాజాగా వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో హారిక హాసిని నుంచి భారీ సినిమా రానుంది. వచ్చే సమ్మర్ స్పెషల్ గా ఈ మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది.

అలాగే చినబాబు మద్దతుతో స్థాపితమైన సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన 'జెర్సీ, భీష్మ, భీమ్లా నాయక్, టిల్లు సిరీస్, లక్కీ భాస్కర్, డాకు మహారాజ్, కింగ్డమ్' వంటి సినిమాలు యువత నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అందరి హృదయాలను గెలుచుకున్నాయి.

మొత్తానికి.. హారిక హాసిని, సితార సంస్థలు అందిస్తున్న ప్రతి సినిమా తెలుగు సినిమా స్థాయిని కొత్త ఎత్తులకు తీసుకెళ్తోంది. ఈ ఈరోజు చినబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తుంది తెలుగు 70 ఎమ్.ఎమ్. మునుముందు మరిన్ని మణిరత్నాల్లాంటి సినిమాలు ఆయన నుంచి రావాలని కోరుకుంటున్నాం.

Tags:    

Similar News