‘ధురంధర్’ కాంబోలో భారీ పౌరాణిక చిత్రం?
రణవీర్ సింగ్ అండ్ అదిత్య ధర్ ఒక పౌరాణిక కథాంశంపై కూడా చర్చలు జరుపుతున్నారని వినికిడి. 'ధురంధర్' చిత్రీకరణ సమయంలో ఏర్పడిన బలమైన బంధం కారణంగా, ఈ ఇద్దరూ మరోసారి కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారట.;
బాలీవుడ్ యాక్షన్ డైనమైట్ రణవీర్ సింగ్, 'ఉరి' డైరెక్టర్ అదిత్య ధర్ కాంబోలో 'ధురంధర్' అనే యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిన సంగతి తెలిసిందే . ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్-లుక్ టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందింది. ఈ రోజు నుంచి అది థియేటర్లలో ప్రదర్శన కానుంది. ఈ చిత్రంలో ఇంకా సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం, రణవీర్ సింగ్ అండ్ అదిత్య ధర్ ఒక పౌరాణిక కథాంశంపై కూడా చర్చలు జరుపుతున్నారని వినికిడి. 'ధురంధర్' చిత్రీకరణ సమయంలో ఏర్పడిన బలమైన బంధం కారణంగా, ఈ ఇద్దరూ మరోసారి కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారట. అయితే, ఈ ప్రాజెక్ట్ 'ది ఇమ్మోర్టల్స్ ఆఫ్ అశ్వత్థామ'తో ఎలాంటి సంబంధం లేదని రిపోర్ట్ స్పష్టం చేసింది.
స్క్రిప్ట్ పని ఇంకా ప్రారంభం కానప్పటికీ, రణవీర్ సింగ్, అదిత్య ధర్ హిందూ పురాణాల్లో రూట్ అయిన ఒక గ్రాండ్ క్యారెక్టర్‌ను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే, 'ధురంధర్' బాక్సాఫీస్ ప్రదర్శన ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.