బాలీవుడ్ లో ‘పంజా’ దర్శకుడి జాంబీ మూవీ
తాజా సమాచారం ప్రకారం.. కార్తిక్ ఆర్యన్ .. ‘పంజా’ దర్శకుడు విష్ణువర్ధన్‌తో ఒక జాంబీ సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడని టాక్.;
బాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం ‘తూ మేరీ మైం తేరా మైం తేరా తూ మేరీ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇందులో అనన్యా పాండే కూడా నటిస్తోంది. అంతేకాదు.. అనురాగ్ బసు దర్శకత్వంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఒక రొమాంటిక్ డ్రామాను కూడా కార్తీక్ పూర్తి చేశాడు. ఇటీవల, ‘చక్ దే ఇండియా’ దర్శకుడు షిమిత్ అమిన్‌తో కార్తీక్ ఒక ఏరియల్ యాక్షన్ సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం.. కార్తిక్ ఆర్యన్ .. ‘పంజా’ దర్శకుడు విష్ణువర్ధన్‌తో ఒక జాంబీ సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడని టాక్. విష్ణువర్ధన్ తమిళ కోలీవుడ్ లో పేరొందిన దర్శకుడు. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ నటించిన ‘షేర్షా’ సినిమాకు అతడు దర్శకత్వం వహించాడు. దీనిని ఒక క్లాసిక్‌గా పరిగణిస్తారు.
కార్తీక్ ఆర్యన్ చాలా కాలంగా జాంబీ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. విష్ణువర్ధన్ ఒక ప్రత్యేకమైన జాంబీ స్క్రిప్ట్‌ను రూపొందించాడని, ఆ స్క్రిప్ట్‌లోని ప్రపంచం కార్తీక్‌కు చాలా నచ్చిందని తెలుస్తోంది. అందుకే అతడు ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా 2026లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. మరి విష్ణు వర్ధన్ తన స్టైల్లో జాంబీ జోనర్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.