హిందీ ‘ఒప్పం’ లో మోహన్ లాల్ క్యామియో

ఈ చిత్రం ప్రియదర్శన్ 2016 మలయాళ థ్రిల్లర్ ‘ఒప్పం’ నుంచి స్ఫూర్తి పొందింది. అయితే సంభాషణలు, స్క్రీన్‌ప్లేలో గణనీయమైన మార్పులు చేశారని డైరెక్టర్ తెలిపారు.;

By :  K R K
Update: 2025-08-25 01:16 GMT

వెటరన్ ఫిల్మ్‌మేకర్ ప్రియదర్శన్ తన రాబోయే హిందీ చిత్రం ‘హైవాన్’ లో మోహన్‌లాల్ కామియో రోల్‌లో కనిపించనున్నట్లు ధృవీకరించారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాత్ర ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ అని డైరెక్టర్ వెల్లడించారు. ‘హైవాన్’ చిత్రాన్ని కేవీయన్ ప్రొడక్షన్స్, థెస్పియన్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రం ప్రియదర్శన్ 2016 మలయాళ థ్రిల్లర్ ‘ఒప్పం’ నుంచి స్ఫూర్తి పొందింది. అయితే సంభాషణలు, స్క్రీన్‌ప్లేలో గణనీయమైన మార్పులు చేశారని డైరెక్టర్ తెలిపారు. ఒప్పంలో మోహన్‌లాల్ అంధుడిగా నటించి, ఒక జడ్జి కూతురిని రక్షించే అసాధారణ పాత్ర పోషించారు. ‘హైవాన్’ ప్రియదర్శన్ 99వ చిత్రం. ఇందులో అక్షయ్ కుమార్‌తో ఆయన మళ్లీ కలిసారు. వీరిద్దరూ గతంలో బాలీవుడ్‌లో పలు హిట్ చిత్రాలు అందించారు.

ఈ చిత్రంలో శ్రియా పిల్‌గాంకర్, సాయామి ఖేర్ కూడా నటిస్తున్నారు. కొచ్చిలో షూటింగ్ మరికొన్ని రోజులు కొనసాగి, ఆ తర్వాత వాగమన్, ఊటీ, ముంబైలకు తరలనుంది. ఒప్పంలోని కీలక సన్నివేశం కూడా 9 ఏళ్ల క్రితం కొచ్చిలోని పనంపిల్లి నగర్‌లోనే చిత్రీకరించినట్లు డైరెక్టర్ గుర్తు చేశారు. ఇక ‘హైవాన్’ చిత్రంలో సైఫ్ ఆలీఖాన్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నట్టు సమాచారం.

Tags:    

Similar News