జాన్వీ ఆశలన్నీ ఆ రెండు బాలీవుడ్ సినిమాలపైనే
ఆమె సినిమాలు ఎక్కువగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రిలీజ్ అయ్యాయి. థియేటర్లలో అంతగా ఇంపాక్ట్ చూపలేక పోయాయి. కానీ, ఈ ఏడాది జాన్వీ ఫుల్ ఫామ్‌లో ఉంది. రెండు భారీ థియేట్రికల్ రిలీజ్‌లతో రెడీ అవుతోంది. ఈ రెండు సినిమాలపైనే ఆమె ఆశలన్నీ పెట్టుకుంది.;
అందాల హీరోయిన్ జాన్వీ కపూర్.. బాలీవుడ్‌లో తన తొలి సినిమా “ధడక్” తో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఒక సాలిడ్ బాక్స్ ఆఫీస్ హిట్ కోసం వెయిట్ చేస్తోంది. ఆమెకు బ్యాక్-టు-బ్యాక్ మంచి ప్రాజెక్ట్‌లు దొరికినా.. ఆమె సినిమాలు ఎక్కువగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రిలీజ్ అయ్యాయి. థియేటర్లలో అంతగా ఇంపాక్ట్ చూపలేక పోయాయి. కానీ, ఈ ఏడాది జాన్వీ ఫుల్ ఫామ్‌లో ఉంది. రెండు భారీ థియేట్రికల్ రిలీజ్‌లతో రెడీ అవుతోంది. ఈ రెండు సినిమాలపైనే ఆమె ఆశలన్నీ పెట్టుకుంది.
జాన్వీ ఈ ఏడాది మొదటి థియాట్రికల్ రిలీజ్ “పరమ్ సుందరి”. ఆగస్టు 29, 2025 న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రొమాంటిక్ డ్రామాలో జాన్వీ ఒక మలయాళీ అమ్మాయి పాత్రలో కనిపించనుంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో జోడీ కడుతోంది. ఈ సినిమా ఇప్పటికే ఫుల్ బజ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా.. దీని హిట్ సాంగ్ “పరదేశియా” సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, యూత్‌లో సూపర్ క్రేజ్ నెలకొల్పింది.
జాన్వీ, సిద్ధార్థ్ కలిసి దేశవ్యాప్తంగా ఒక భారీ ప్రమోషనల్ టూర్ కూడా చేశారు, దీంతో సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఈ సినిమా జాన్వీకి ఆ ఒక్క బాక్స్ ఆఫీస్ బ్లాక్‌బస్టర్ ఇస్తుందని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆమె కెరీర్‌లో ఒక గేమ్-చేంజర్ అవుతుందనే టాక్ బాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
ఇంక ఈ ఏడాది చివర్లో.. జాన్వీ మరో బాలీవుడ్ సినిమా “సన్నీ సంస్కారీకీ తులసీ కుమారీ” తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కూడా ఆమెకు థియేటర్లలో మంచి గుర్తింపు తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ రెండు సినిమాలతో జాన్వీ బాలీవుడ్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. మొత్తానికి జాన్వీ కెరీర్ ఈ ఏడాది ఒక కొత్త టర్న్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ రెండు సినిమాలు జాన్వీకి ఎలాంటి క్రేజ్ తెచ్చిపెడతాయో చూడాలి.