ముంబై లో ‘టాక్సిక్’ షూట్ లో జాయిన్ అయిన యశ్

మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ జులై 21న ముంబైలో లేటెస్ట్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేసింది. ఈ షెడ్యూల్‌లో యశ్‌తో పాటు హుమా కురేషి, తారా సుతారియా, అక్షయ్ ఒబెరాయ్ నటిస్తున్నారు.;

By :  K R K
Update: 2025-07-25 04:35 GMT

‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ భారీ విజయంతో దూసుకెళ్లిన తర్వాత.. కన్నడ రాక్ స్టార్ యశ్ తన కొత్త సినిమా ‘టాక్సిక్’ తో మరో స్థాయికి చేరాలని భావిస్తున్నాడు. ఈ చిత్రం యాక్షన్ స్పెక్టాకిల్‌గా రూపొందుతోంది. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ జులై 21న ముంబైలో లేటెస్ట్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేసింది. ఈ షెడ్యూల్‌లో యశ్‌తో పాటు హుమా కురేషి, తారా సుతారియా, అక్షయ్ ఒబెరాయ్ నటిస్తున్నారు.

మూడు వారాల పాటు జరిగే ఈ షెడ్యూల్ పూర్తిగా యాక్షన్ సీక్వెన్స్‌లపై ఫోకస్ చేస్తోంది. ఒక సోర్స్ చెప్పిన ప్రకారం.. గత సోమవారం గోరేగావ్‌లోని ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ మొదలైంది. ఇది ఎక్కువగా ఇండోర్ షూట్, ఇందులో నటీనటులు బాడీ డబుల్స్ లేకుండా స్టంట్స్ చేస్తున్నారు. హ్యాండ్-టు-హ్యాండ్ కంబాట్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. స్టోరీ డిమాండ్‌ను బట్టి, నటీనటులు సెట్‌కు రాకముందు తీవ్రమైన శిక్షణ తీసుకున్నారు.

సేఫ్టీ అండ్ ఎగ్జిక్యూషన్ కోసం 15 మంది ఎక్స్‌పర్ట్‌ల టీమ్‌ను సిద్ధం చేశారు. వీళ్లు నటీనటులకు క్లోజ్-కట్ సీన్స్‌లో సహాయం చేస్తున్నారు. టాక్సిక్ లో యాక్షన్ రా, బ్రూటల్, గ్రౌండెడ్‌గా ఉంటుంది. హ్యాండ్-టు-హ్యాండ్ కంబాట్ సీక్వెన్స్‌లలో యాక్షన్ డైరెక్టర్లు జెజె పెర్రీ, జియోర్గి ఇయరాజులీ క్రావ్ మాగా, ఫిలిపినో కాళీ, ఎమ్ఎమ్ఏ టెక్నిక్స్‌ను మిక్స్ చేసి గ్రిట్టీ స్టైల్ యాక్షన్‌ను క్రియేట్ చేశారు. మరి ఈ సినిమా యశ్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.

Tags:    

Similar News