సమంత విజయవంతమైన తొలి అడుగు

సమంత నిర్మాతగా మొదటి ప్రయత్నంలోనే మంచి ఫలితాన్ని అందుకుంటుంది. మే 9న విడుదలైన హారర్ కామెడీ 'శుభం' చిత్రానికి, మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.;

By :  S D R
Update: 2025-05-11 02:40 GMT

సమంత నిర్మాతగా మొదటి ప్రయత్నంలోనే మంచి ఫలితాన్ని అందుకుంటుంది. మే 9న విడుదలైన హారర్ కామెడీ 'శుభం' చిత్రానికి, మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రదీప్ కాండ్రేగుల తెరకెక్కించిన ఈ చిత్రం సరికొత్త కథా ప్రయోగంగా ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది.

బాక్సాఫీస్ పరంగా చూసినప్పుడు, ఈ చిన్న సినిమా ఓ మోస్తరుగా ప్రారంభమైనా, ప్రపంచవ్యాప్తంగా రూ.1.5 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్లను సాధించింది. ముఖ్యంగా అమెరికాలో $100K వసూలు కావడం గమనార్హం. ఈ ఆదివారం వరకూ ఈ చిత్రం మరింత కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణ లక్ష్మి ముఖ్య పాత్రల్లో నటించారు. వీరంతా కొత్త వారు అయినప్పటికీ.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో విజయవంతమయ్యారు. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. మరి.. లాంగ్ రన్ లో 'శుభం' ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.

Tags:    

Similar News