త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత?
స్టార్ బ్యూటీ సమంత మళ్లీ సినిమాలు చేసేందుకు సిద్దమవుతుంది. అనారోగ్యం కారణంగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సామ్.. మంచి కథలు ఉంటే నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని హింట్ ఇచ్చింది.;
స్టార్ బ్యూటీ సమంత మళ్లీ సినిమాలు చేసేందుకు సిద్దమవుతుంది. అనారోగ్యం కారణంగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సామ్.. మంచి కథలు ఉంటే నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని హింట్ ఇచ్చింది. ఇటీవలే ‘శుభం‘ సినిమాతో నిర్మాతగానూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది.
సమంత సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. ఆమెతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తుంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత నటించిన ‘అత్తారింటికి దారేతి, సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ‘ సినిమాలు మంచి విజయాలు సాధించాయి.
ఈసారి సమంత ప్రధాన పాత్రలో మహిళా ప్రాధాన్య చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడట గురూజీ. ఇప్పటికే అందుకు సంబంధించి స్క్రిప్ట్ కూడా రెడీ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు త్రివిక్రమ్.. వెంకటేష్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అలాగే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేయాల్సిన మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుంది. ఈ రెండు సినిమాలకంటే ముందే సమంతతో చిత్రాన్ని పట్టాలెక్కించాలనే ప్రయత్నంలో ఉన్నాడట త్రివిక్రమ్.