'రాబిన్‌హుడ్' బాక్సాఫీస్ అంచనాలు!
యూత్ స్టార్ నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న 'రాబిన్‌హుడ్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'భీష్మ' వంటి విజయం తర్వాత వస్తోన్న నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్ సినిమా కావడం కూడా అందుకు కారణం.;
యూత్ స్టార్ నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న 'రాబిన్‌హుడ్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'భీష్మ' వంటి విజయం తర్వాత వస్తోన్న నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడం కూడా అందుకు కారణం.
మాస్, క్లాస్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేసిన ప్రమోషన్లు, సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు, ఆస్ట్రేలియన్ క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ చేయడం సినిమాకి అదనపు బూస్ట్ ఇచ్చింది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, అన్ని ఏరియాల్లోనూ టాప్ డిస్ట్రిబ్యూషన్ ఆఫర్లు దక్కించుకుందట. ముఖ్యంగా నితిన్ గత ఫలితాలను మించి ఈ మూవీ మంచి రన్ ఇవ్వబోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
'రాబిన్‌హుడ్' ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ చిత్రం నైజాంలో రూ.9.50 కోట్లు, ఆంధ్ర రూ.10.50 కోట్లు, సీడెడ్ రూ.3 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి రూ.4.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట మొత్తంగా వరల్డ్ వైడ్ ఈ సినిమా బిజినెస్ రూ.27.50 కోట్లు జరిగినట్టు తెలుస్తోంది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రూ.28 కోట్ల షేర్ సాధించాలి. హిట్ టాక్ వస్తే, తొలి వీకెండ్ కలెక్షన్స్‌తోనే ఈ టార్గెట్ అందుకోవచ్చు.