రెమ్యునరేషన్ డబుల్ – వెంకటేష్ కొత్త లెవెల్!

రేంజు పెరిగితే రెమ్యునరేషన్ పెరగడం అనేది వెరీ కామన్. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కూడా ఇదే ఫాలో అవుతున్నాడట. టాలీవుడ్ సీనియర్స్ లో రూ.300 కోట్ల క్లబ్ లో చేరిన ఏకైక హీరోగా వెంకీ నిలిచాడు.;

By :  S D R
Update: 2025-02-02 00:10 GMT

రేంజు పెరిగితే రెమ్యునరేషన్ పెరగడం అనేది వెరీ కామన్. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కూడా ఇదే ఫాలో అవుతున్నాడట. టాలీవుడ్ సీనియర్స్ లో రూ.300 కోట్ల క్లబ్ లో చేరిన ఏకైక హీరోగా వెంకీ నిలిచాడు. సంక్రాంతి బరిలో విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు కొల్లగొట్టి.. ఇంకా వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది.

'సంక్రాంతికి వస్తున్నాం' వరకూ సినిమాకి రూ.10 నుంచి రూ.12 కోట్లు తీసుకున్న వెంకటేష్.. ఇప్పుడు తర్వాతి సినిమాకోసం రూ.25 కోట్లు పుచ్చుకుంటున్నాడట. ఇంతవరకు టాలీవుడ్‌లో సీనియర్ హీరోలు నేటితరం యువ స్టార్ హీరోల కంటే తక్కువ రెమ్యూనరేషన్‌తో సినిమాలు చేసేవారు. ముఖ్యంగా వెంకటేష్, బాలకృష్ణ వంటి వారు ఎన్ని విజయాలు అందించినా పారితోషికాన్ని ఎక్కువగా పెంచిన దాఖలాలు లేవు.

ఇటీవల 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రమోషన్స్ లోనూ వెంకీ ఇదే విషయాన్ని తెలిపాడు. తాను తీసుకునేదే తక్కువ.. అది కూడా వైట్ లోనే తీసుకుంటానని వెంకీ అన్నాడు. మొత్తంగా.. భారీ విజయాన్ని అందుకున్న తర్వాత మార్కెట్‌కి తగ్గట్లుగా వెంకటేష్ పారితోషికాన్ని పెంచుకోవడం సహజమే. మరోవైపు 'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత వెంకీ చేయబోయే కొత్త సినిమా ఏంటి? ఎవరితో? అనేదే ఇంకా సస్పెన్స్ గా ఉంది.

Tags:    

Similar News