రష్మిక దెయ్యం ప్రేమకథ
పాన్ ఇండియా లెవెల్ లో హీరోయిన్‌గా దూసుకుపోతుంది రష్మిక. ‘యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర‘ వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకుంది.;
పాన్ ఇండియా లెవెల్ లో హీరోయిన్‌గా దూసుకుపోతుంది రష్మిక. ‘యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర‘ వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకుంది. ఇక బాలీవుడ్ లో ‘ఛావా‘ తర్వాత రష్మిక నుంచి రాబోతున్న మరో చిత్రం ‘థామా‘. సూపర్ హిట్ హారర్ సిరీస్ ‘స్త్రీ‘ యూనివర్శ్ లో భాగంగా ఈ చిత్రం వస్తోంది. ఈ సినిమాలో రష్మిక, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్నారు.
మడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్న ‘థామా‘ మూవీ నుంచి ‘వరల్డ్ ఆఫ్ థామా’ పేరుతో టీజర్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో హీరోహీరోయిన్లు ఆయుష్మాన్, రష్మిక ఇద్దరూ దెయ్యాలుగా కనిపించబోతున్నారు. ఆ దెయ్యాల ప్రేమకథ ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందినట్టు టీజర్ ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమాలో పరేష్ రావెల్, నవజుద్దీన్ సిద్ధిఖీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారర్, కామెడీ, రొమాన్స్ కలగలిపిన కథాంశంతో రూపొందిన ‘థామా‘ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.