ఆకట్టుకుంటున్న ‘లిటిల్ హార్ట్స్‘ టీజర్

‘90’s’ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్‘ ఫేమ్ మౌళి, శివాని నాగారం జంటగా నటించిన సినిమా ‘లిటిల్ హార్ట్స్‘. ఈటీవీ విన్‌ (ETV Win) ఒరిజినల్‌ ప్రొడక్షన్‌ నుంచి వస్తోన్న ఈ మూవీని ‘90’s’ ఫేమ్ ఆదిత్య హాసన్ నిర్మిస్తుండటం విశేషం.;

By :  S D R
Update: 2025-08-19 11:42 GMT

‘90’s’ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్‘ ఫేమ్ మౌళి, శివాని నాగారం జంటగా నటించిన సినిమా ‘లిటిల్ హార్ట్స్‘. ఈటీవీ విన్‌ (ETV Win) ఒరిజినల్‌ ప్రొడక్షన్‌ నుంచి వస్తోన్న ఈ మూవీని ‘90’s’ ఫేమ్ ఆదిత్య హాసన్ నిర్మిస్తుండటం విశేషం. సాయి మార్తాండ్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

కాలేజ్ రోజుల్లో విద్యార్థుల మధ్య జరిగే సరదా సంఘటనలు ఈ టీజర్ కి హైలైట్. ఇందులో ప్రేమకథ ఇతివృత్తాన్ని చేర్చి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఎంటర్‌టైనింగ్ మూమెంట్స్‌తో దర్శకుడు ఈ సినిమాని తీర్చిదిద్దినట్టు అర్థమవుతుంది. రాజీవ్ కనకాల హీరో తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 12న ఈ మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది.


Full View


Tags:    

Similar News