రెండు ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్న సినీ కార్మికులు

టాలీవుడ్‌లో కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఈరోజు మరో కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 24 అనుబంధ కార్మిక సంఘాలు కలిసి ఐక్య వేదికలో సమావేశమయ్యాయి.;

By :  S D R
Update: 2025-08-19 08:11 GMT

టాలీవుడ్‌లో కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఈరోజు మరో కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 24 అనుబంధ కార్మిక సంఘాలు కలిసి ఐక్య వేదికలో సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, చదలవాడ శ్రీనివాసరావు, నట్టికుమార్ హాజరయ్యారు. అలాగే, ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, సెక్రటరీ అమ్మిరాజుతో పాటు వివిధ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.

ఫెడరేషన్ నాయకులు, కార్మిక సంఘాల సర్వసభ్య సమావేశంలో నిర్మాతలు పెట్టిన కండిషన్లను వివరించారు. నిర్మాతలు మొత్తం నాలుగు కండిషన్లు ప్రతిపాదించగా, వాటిలో రెండు అంశాలపై ఎక్కువగా చర్చలు జరిగాయి. అవి.. ఫ్లెక్సిబుల్ కాల్షీట్స్ అమలు, సెకండ్ సండే-గవర్నమెంట్ హాలిడేస్‌కే డబుల్ కాల్‌షీట్ వర్తింపు.

ఈ రెండు ప్రతిపాదనలను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

అంతేకాకుండా, తమ సమస్యలు త్వరగా పరిష్కరించబడాలని కోరుతూ సినీ కార్మికులు సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకుల సమావేశం జరగనుంది. ఈ చర్చల ద్వారా కొనసాగుతున్న సమ్మె సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.

Tags:    

Similar News