'సిండికేట్'తో వస్తోన్న రామ్ గోపాల్ వర్మ!
రామ్ గోపాల్ వర్మ కొత్త ప్రాజెక్ట్ 'సిండికేట్'ను ప్రకటించాడు. 1970ల గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతుందని తెలిపాడు.;
రామ్ గోపాల్ వర్మ.. ఇండియన్ సినిమాను తనదైన ప్రత్యేకతతో ఎంతగానో ప్రభావితం చేసిన దర్శకుడు. ఈ సంచలన దర్శకుడు తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ 'సిండికేట్'ను ప్రకటించాడు. 1970ల గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతుందని తెలిపాడు.ఈ సినిమా అత్యంత భయంకరమైన కోణంలో మనిషిని ఆవిష్కరించనుందని.. అతీత శక్తులకంటే, మానవ స్వభావం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ సినిమాలో చూపించబోతున్నట్టు వర్మ తెలిపాడు.
అయితే ఈ సినిమా ప్రకటనకు ముందు, తన కల్ట్ క్లాసిక్ 'సత్య' గురించి వర్మ భావోద్వేగ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇకపై తాను 'సత్య' వంటి గొప్ప సినిమాలు చేస్తానని ప్రస్తావిస్తూ ప్రేక్షకులకు వాగ్దానం చేశాడు. ఈ ప్రకటనపై ప్రేక్షకులు కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వర్మ 'సత్య'పై ఇంత ప్రేమ కురిపిస్తున్నాడంటే ఏదో ప్రణాళికతోనే వస్తున్నాడని అంచనా వేశారు. అది ఇప్పుడు 'సిండికేట్' అనౌన్స్ మెంట్ తో నిజమైంది.
ఈమధ్య కాలంలో 'పుష్ప 2'ని విపరీతంగా పొగిడేసిన వర్మ.. అందులోని బాగా పాపులరైన 'సిండికేట్' పదంతో సినిమా తీయబోతున్నాడు. మరి.. ఈ 'సిండికేట్'తో రామ్ గోపాల్ వర్మ మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.