కన్నప్ప లో రజనీకాంత్‌?

Update: 2025-06-06 07:50 GMT

కన్నప్ప లో రజనీకాంత్‌?మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా జూన్ 27న విడుదలకు సిద్ధమవుతోంది. శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్‌, మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, అక్షయ్ కుమార్‌, కాజల్ అగర్వాల్‌ కీలక అతిథి పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తై, ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న విష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో కన్నప్ప గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

విష్ణు మాట్లాడుతూ, మోహన్‌బాబుతో కలసి ఒక ప్రత్యేక క్యారెక్టర్‌ను రూపొందించామని, ఆ పాత్ర కోసం సూపర్ స్టార్ రజనీకాంత్‌ను అనుకోవడం జరిగిందని చెప్పారు. కానీ కథతో సంబంధం లేని ట్రాక్‌గా మారుతుందన్న రచయితల అభిప్రాయంతో ఆ పాత్రను తొలగించాల్సి వచ్చిందన్నారు.

ప్రభాస్‌ను తీసుకోవడం వెనుక ఉన్న కారణం గురించి మాట్లాడుతూ – 'రెండు క్యారెక్టర్లలో ఒకటిని ఎంపిక చేయమంటే, ప్రభాస్‌ రుద్ర పాత్రపైనే ఆసక్తి చూపించారు. ఆయనను శివుడిగా కాకుండా, రుద్ర రూపంలో చూపించాం. ఎందుకు ఆయనను ఎంపిక చేసామన్నది సినిమా చూశాకే అర్థమవుతుంది' అని వెల్లడించారు.

సెన్సార్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను షేర్ చేస్తూ – 'ఓ లిరికల్ వీడియో కోసం సెన్సార్‌కు పంపినప్పుడు, ‘కన్నప్పకు ప్రేమకథ ఉందన్న ఆధారాలేం?’ అని అడిగారు. నిజానికి కన్నప్పకు భార్య నీల ఉంది. ఆ విషయాన్ని చెప్పగానే ఆశ్చర్యపోయారు' అని తెలిపారు.

తన వ్యక్తిగత ప్రయాణం గురించి మాట్లాడుతూ – 'నటుడిగా మారాలన్నదే నా చిన్ననాటి ఆశయం. కానీ నేను అందగాడిని కాను. దేవుడిని ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగేవాడిని. నటన నా జీవితం. కానీ యూనివర్సిటీ, స్కూల్‌ నిర్వహణ నాన్న ఇచ్చిన బాధ్యత' అన్నారు. ఆయన వ్యాపార దృక్పథాన్ని షేర్ చేస్తూ – 'టాటా, రిలయన్స్‌లా మన యూనివర్సిటీ పేరు బ్రాండ్‌గా నిలవాలి. అది నా కల' అని అన్నారు.

Tags:    

Similar News