వసూళ్లలో 'రైడ్ 2' దూసుకుపోతోంది...
వసూళ్లలో 'రైడ్ 2' దూసుకుపోతోందిఅజయ్ దేవగన్ నటించిన ‘రైడ్ 2’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రంపై పెద్దగా అంచనాలు లేకపోయినా, ఓపెనింగ్ రోజు దాదాపు రూ.20 కోట్ల వసూళ్లు సాధించడంతో పరిశ్రమను ఆశ్చర్యపరిచింది.
శుక్రవారం రోజు ఈ సినిమా సుమారుగా రూ.12 కోట్ల వసూళ్లు రాబట్టగా, శనివారం రోజున దాదాపు రూ.18 కోట్లకు పైగా వసూలు చేసి భారీ వృద్ధిని కనబర్చింది. దీని వల్ల దీర్ఘవీకెండ్‌లో చిత్రం మొదటి మూడు రోజుల్లోనే రూ.70 కోట్ల మార్క్ దాటి పోయే అవకాశాలు ఉన్నాయి.
ట్రేడ్ ఎనలిస్టుల అంచనాల ప్రకారం, ఆదివారం రోజున ఈ చిత్రం రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తే, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ రూ.70 కోట్లకు మించవచ్చు. సోమవారం నుంచి స్టడీగా రూ.6-7 కోట్ల వసూళ్లను కొనసాగిస్తే, ఈ సినిమా మొత్తం కలెక్షన్ రూ.130-140 కోట్లను తాకే అవకాశముంది. ఇది సినిమాను సాలిడ్ హిట్‌గా నిలబెడుతుంది.
ఇది చూస్తుంటే.. బాలీవుడ్ ప్రేక్షకులు కొత్త కథాంశాల పట్ల ఆసక్తి చూపుతున్నారని అర్థమవుతోంది. ఇటీవల విడుదలైన ‘కేసరి చాప్టర్ 2’, ‘జాట్’ వంటి చిత్రాలు మంచి వసూళ్లను నమోదు చేయడం కూడా దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు.
ఇక సల్మాన్ ఖాన్ నటించిన ‘సికందర్’ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, అజయ్ దేవగన్‌కి ‘రైడ్ 2’ రూపంలో మంచి విజయం లభించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికి వరకూ ఈ చిత్రానికి వచ్చిన స్పందన చూస్తే, రాబోయే వారాల్లో ఇంకా ఏ మేరకు వసూళ్లు జరగబోతున్నాయో చూడాలి మరి.