నెట్ ఫ్లిక్స్ కోసం ప్రచారాన్ని మొదలెట్టిన పుష్పరాజ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2‘ ఈరోజు నుంచే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. 23 నిమిషాల అదనపు రన్ టైమ్ తో రీలోడెడ్ వెర్షన్ ను అందుబాటు లోకి తీసుకొచ్చింది ఓటీటీ జయంట్ నెట్ ఫ్లిక్స్. తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.;

By :  S D R
Update: 2025-01-30 10:29 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2‘ ఈరోజు నుంచే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. 23 నిమిషాల అదనపు రన్ టైమ్ తో రీలోడెడ్ వెర్షన్ ను అందుబాటు లోకి తీసుకొచ్చింది ఓటీటీ జయంట్ నెట్ ఫ్లిక్స్. తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రికల్ రిలీజ్ కు ముందు ‘పుష్ప 2‘ని ఓ రేంజులో ప్రమోట్ చేశాడు అల్లు అర్జున్. ఇప్పుడు ఓటీటీ కోసం కూడా ఈ సినిమాని బన్నీ ప్రమోట్ చేస్తుండడం విశేషమని చెప్పాలి.

‘పుష్ప 2.. ది రూల్‘ స్ట్రీమింగ్ అవుతున్నట్టు తెలియజేస్తూ.. పుష్ప రాజ్ గెటప్ లో అల్లు అర్జున్ అండ్ టీమ్ చేసిన ప్రమోషనల్ వీడియోని రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. థియేట్రికల్ రిలీజ్ కోసమే కాదు.. ఓటీటీ రిలీజ్ కోసం కూడా ఓ హీరో ఈ రేంజులో ప్రమోట్ చేయడం అంటే ఆషామాషీ కాదంటూ ఫ్యాన్స్ బన్నీని ఆకాశానికెత్తేస్తున్నారు.

మరోవైపు ‘పుష్ప 2‘ ఓటీటీ రైట్స్ ను రికార్డు ప్రైస్ కు కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్. ఈ మూవీని ఏకంగా రూ.250 కోట్లకు నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు ప్రచారం జరిగింది. మొత్తంగా నెట్ ఫ్లిక్స్ లో ‘పుష్ప 2‘ దూకుడు ఏ రేంజులో కొనసాగుతుందో చూడాలి.


Full View


Tags:    

Similar News