ప్రదీప్, దీపిక ప్రమోషనల్ వీడియో!
బుల్లితెర క్రేజీ యాంకర్ ప్రదీప్ హీరోగా, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ‘జబర్దస్త్‘ బ్యూటీ దీపికా పిల్లి హీరోయిన్ గా రూపొందిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి‘.;
బుల్లితెర క్రేజీ యాంకర్ ప్రదీప్ హీరోగా, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ‘జబర్దస్త్‘ బ్యూటీ దీపికా పిల్లి హీరోయిన్ గా రూపొందిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి‘. ఈ చిత్రాన్ని జబర్దస్త్ కామెడీ షో డైరెక్టర్స్ నితిన్, భరత్ లు తెరకెక్కించడం మరో విశేషం. బుల్లితెర టాలెంట్ అంతా కలిసి పనిచేసిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి‘ ఏప్రిల్ 11న విడుదలకు ముస్తాబవుతుంది.
ఈనేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లు ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఓ ప్రమోషనల్ వీడియోని రిలీజ్ చేశారు. ‘అందాల చందమామ‘ అంటూ సాగే ఈ గీతం ఆకట్టుకుంటుంది. లీడ్ పెయిర్ ప్రదీప్, దీపిక లతో పాటు గెటప్ శ్రీను కూడా ఈ సాంగ్ లో సందడి చేస్తున్నాడు.
ఓ వెరైటీ స్టోరీతో ఫుల్ లెన్త్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి‘ రాబోతుంది. ఈ సినిమాలో సత్య, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.