‘కన్నప్ప‘ నుంచి ప్రభాస్ లుక్ వస్తోంది!
‘కన్నప్ప‘ నుంచి ప్రభాస్ లుక్ అఫీషియల్ గా రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్సయ్యింది. ఫిబ్రవరి 3న ‘కన్నప్ప‘ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది టీమ్.;
రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకవైపు ఫుల్ లెన్త్ రోల్స్ తో అదరగొడుతూనే.. మరోవైపు మంచు విష్ణు ‘కన్నప్ప‘ కోసం కేమియోలో కనిపించబోతున్నాడు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప‘ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ ఎంతో కీలకంగా ఉండబోతుందనే ప్రచారం ఉంది. కనిపించేవి తక్కువ సీన్స్ అయినా.. ప్రభాస్ క్యారెక్టర్ ‘కన్నప్ప‘లో ఎంతో ప్రభావం చూపుతుందని చిత్రబృందం చెబుతూనే ఉంది.
ఇప్పటికే రిలీజైన ‘కన్నప్ప‘ టీజర్ లో ప్రభాస్ కళ్లు మాత్రమే కనిపించాయి. ఆ తర్వాత ఈ సినిమా నుంచి ప్రభాస్ లుక్ లీక్ అవ్వడం.. చిత్రబృందం అలెర్ట్ అవ్వడం జరిగింది. ఇక లేటెస్ట్ గా ‘కన్నప్ప‘ నుంచి ప్రభాస్ లుక్ అఫీషియల్ గా రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్సయ్యింది. ఫిబ్రవరి 3న ‘కన్నప్ప‘ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది టీమ్. ఏప్రిల్ 25న ‘కన్నప్ప‘ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది.