ప్రతీ ఫ్రేములో పవన్ ప్రాణం పెట్టారు - మనోజ్ పరమహంస

'హరిహర వీరమల్లు' చిత్రానికి ఇద్దరు దర్శకులు పనిచేశారు. తొలుత ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించగా.. ఆ తర్వాత జ్యోతికృష్ణ ఆన్ బోర్డులోకి వచ్చారు.;

By :  S D R
Update: 2025-07-21 05:59 GMT

'హరిహర వీరమల్లు' చిత్రానికి ఇద్దరు దర్శకులు పనిచేశారు. తొలుత ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించగా.. ఆ తర్వాత జ్యోతికృష్ణ ఆన్ బోర్డులోకి వచ్చారు. క్రిష్ తెరకెక్కించినప్పుడు ఙ్ఞానశేఖర్ ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయగా.. జ్యోతికృష్ణతో మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

'హరిహర వీరమల్లు' కోసం ప్రతీ ఫ్రేములో పవన్ ప్రాణం పెట్టి నటించారని.. ప్రెస్ మీట్ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస అన్నారు. 'ఏమాయ చేశావే, స్నేహితుడు, రేసుగుర్రం, బీస్ట్, లియో, గుంటూరు కారం' వంటి చిత్రాలకు పనిచేసిన మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ 'వీరమల్లు'కు ఎంతో ప్లస్ అవుతుందని భావిస్తోంది టీమ్.

Tags:    

Similar News