పొంగల్ పోరులో 'పరాశక్తి'

వచ్చే సంక్రాంతి పోటీ ఆసక్తికరంగా మారబోతుంది. ఇప్పటికే తెలుగు నుంచి చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు', ప్రభాస్ 'ది రాజా సాబ్', రవితేజ-కిషోర్ తిరుమల మూవీ, నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.;

By :  S D R
Update: 2025-08-27 01:44 GMT

వచ్చే సంక్రాంతి పోటీ ఆసక్తికరంగా మారబోతుంది. ఇప్పటికే తెలుగు నుంచి చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు', ప్రభాస్ 'ది రాజా సాబ్', రవితేజ-కిషోర్ తిరుమల మూవీ, నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మరోవైపు తమిళం నుంచి దళపతి విజయ్ 'జన నాయగన్' కూడా పొంగల్ పోరులో ఉంది.

లేటెస్ట్ గా పొంగల్ ను టార్గెట్ చేస్తూ తమిళం నుంచి మరో చిత్రం రాబోతుందట. శివ కార్తికేయన్ నటిస్తున్న 'పరాశక్తి' పొంగల్ బరిలో విడుదలకు ముస్తాబవుతుందట. 'అమరన్' సినిమాతో తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న శివకార్తికేయన్ కి తోడు శ్రీలీల, రవి మోహన్, అధర్వ వంటి క్రేజీ స్టార్ కాస్ట్ ఈ మూవీలో ఉంది. పైగా.. స్టార్ లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో 'పరాశక్తి'పై అంచనాలు భారీగా ఉన్నాయి.

విజయ్ 'జన నాయగన్' తెలుగులో 'జన నాయకుడు'గా వస్తుండగా.. 'పరాశక్తి' కూడా తెలుగులో అదే పేరుతో అనువాద రూపంలో రాబోతుంది. దీంతో.. వచ్చే సంక్రాంతి బరిలో ఇటు తెలుగు, అటు తమిళం నుంచి అరడజనుకు పైగా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటానికి సిద్ధమవుతున్నాయి.

Tags:    

Similar News