ప్రియాంక చోప్రా ‘అనూజా’పై ఆస్కార్ ఆశలు!
లాస్ ఏంజెలిస్ నగరాన్ని చుట్టుముట్టిన కార్చిచ్చు కారణంగా ఆలస్యమైన 97వ ఆస్కార్ నామినేషన్లు ఎట్టకేలకు ప్రకటించబడ్డాయి. ఇండియన్ షార్ట్ ఫిల్మ్ ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ పొందింది.;
లాస్ ఏంజెలిస్ నగరాన్ని చుట్టుముట్టిన కార్చిచ్చు కారణంగా ఆలస్యమైన 97వ ఆస్కార్ నామినేషన్లు ఎట్టకేలకు ప్రకటించబడ్డాయి. ఆస్కార్ అవార్డుల వేడుక ఈ సంవత్సరం మార్చి 2న లాస్ ఏంజెలిస్‌లో జరగనుంది.
ఈసారి అత్యధిక నామినేషన్లు గెలుచుకున్న చిత్రాలు 'ది బ్రూటలిస్ట్, ఎమిలియా పెరెజ్' కాగా, ఇతర ప్రధాన చిత్రాల్లో 'కాన్‌క్లేవ్, డ్యూన్: పార్ట్ 2, అనోరా’ ఉన్నాయి. ఇండియన్ షార్ట్ ఫిల్మ్ ‘అనూజ’ ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ పొందింది. ప్రియాంక చోప్రా జోన్స్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కావడం విశేషం. తొమ్మిదేళ్ల వయసుగల గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికురాలి జీవితం ఆధారంగా రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్‌ను ప్రియాంక చోప్రా, గునీత్ మోంగా నిర్మించారు.
ఇక ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్లలో ముఖ్య కేటగిరీల విషయానికొస్తే..
ఉత్తమ చిత్రం:
అనోరా, ది బ్రూటలిస్ట్, డ్యూన్: పార్ట్ 2, ఎమిలియా పెరెజ్, విక్డ్ తదితర చిత్రాలు.
ఉత్తమ దర్శకుడు:
సీన్ బేకర్ (అనోరా), బ్రాడీ కార్బెట్ (ది బ్రూటలిస్ట్), జాక్వెస్ ఆడియార్డ్ (ఎమిలియా పెరెజ్).
ఉత్తమ నటుడు:
అడ్రియాన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్), తిమోతీ చాలమెట్ (ఏ కంప్లీట్ అన్‌నోన్).
ఉత్తమ నటి:
సింథియా ఎరివో (విక్డ్), కార్లా సోఫియా గాస్కన్ (ఎమిలియా పెరెజ్).
ఈసారి భారతీయ చిత్రాలకు పెద్దగా స్థానం లభించకపోయినప్పటికీ, ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ ఒక గొప్ప ప్రాతినిధ్యాన్ని కలిగించింది. మరి.. ఫైనల్ గా 'అనూజ' ఆస్కార్ ను గెలుచుకుంటుందేమో చూడాలి.