అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే కోటి వసూళ్లు!
‘బాహుబలి‘ సిరీస్ తర్వాత రెబెల్ స్టార్ ప్రభాస్ కు మళ్లీ గ్రేట్ కమ్ బ్యాక్ గా నిలిచింది ‘సలార్‘. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ అండ్ వైలెన్స్ మూవీ ప్రభాస్ కెరీర్లో ఒన్ ఆఫ్ ది రికార్డు గ్రాసర్ గా నిలిచింది.;
‘బాహుబలి‘ సిరీస్ తర్వాత రెబెల్ స్టార్ ప్రభాస్ కు మళ్లీ గ్రేట్ కమ్ బ్యాక్ గా నిలిచింది ‘సలార్‘. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ అండ్ వైలెన్స్ మూవీ ప్రభాస్ కెరీర్లో ఒన్ ఆఫ్ ది రికార్డు గ్రాసర్ గా నిలిచింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే థియేట్రికల్ గా రూ.700 కోట్లు కొల్లగొట్టింది. ఓటీటీలోనూ రికార్డు స్థాయి వ్యూస్ సాధించింది.
లేటెస్ట్ గా ‘సలార్ 1‘ మరోసారి థియేటర్లలోకి వస్తోంది. మార్చి 21న ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవెల్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించి బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ బుకింగ్స్ ఆల్రెడీ 1 కోటికి పైగా గ్రాస్ ని రాబట్టడం విశేషం. ఇది కేవలం డే 1 కి మాత్రమే కాగా.. రీ రిలీజ్ టైమ్ వరకూ ‘సలార్‘ ఎలాంటి ప్రీ సేల్స్ సాధిస్తుందో అనే అంచనాలు మొదలయ్యాయి.
ఇక ‘సలార్‘ మొదటి పార్ట్ షూటింగ్ సమయంలోనే సెకండ్ పార్ట్ షూటింగ్ కొంత మేరకు పూర్తి చేశారు. కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్‌తో చేస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరిలోనే ఎన్టీఆర్ సినిమాను విడుదల చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్ మూవీ విడుదలైన తర్వాతే ‘సలార్ 2‘ తిరిగి పట్టాలెక్కే అవకాశాలున్నాయి.