డైరెక్టర్ కాదు.. డైలాగ్ మాంత్రికుడు!

దర్శకుడిగా ‘వెన్నెల, ప్రస్థానం’ వంటి విలక్షణ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దేవా కట్టా, మాటల రచయితగా కూడా తనదైన ముద్ర వేశాడు.;

By :  S D R
Update: 2025-04-14 02:15 GMT

దర్శకుడిగా ‘వెన్నెల, ప్రస్థానం’ వంటి విలక్షణ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దేవా కట్టా, మాటల రచయితగా కూడా తనదైన ముద్ర వేశాడు. ‘ప్రస్థానం’లోని గాఢతతో నిండిన సంభాషణలు, ‘ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్’ వంటి చిత్రాల్లోనూ కనిపించిన లోతైన డైలాగ్స్ ఆయన రైటింగ్ టాలెంట్‌కు నిదర్శనాలు.

అదే ప్రతిభ రాజమౌళి దృష్టిలో పడడంతో ‘బాహుబలి’ చిత్రానికి కొన్ని కీలక డైలాగులు రాయించుకున్నారు. ప్రత్యేకంగా ప్రభాస్ చెప్పే యుద్ధభూమిలోని మోటివేషనల్ డైలాగులకు మంచి పేరొచ్చింది. తర్వాత ‘బాహుబలి’ వెబ్ సిరీస్‌కు కూడా దేవా కట్టా రచన సహకారం అందించాడు.

ఇప్పుడు మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న ప్రెస్టిజియస్ అడ్వెంచర్ చిత్రానికి పూర్తిస్థాయి డైలాగ్ వర్షన్‌ను దేవా కట్టా రాసినట్టు సమాచారం. రాజమౌళి సినిమాలకు ఒకే రచయితగా ఉండడు. అతను సబ్జెక్ట్‌ను బట్టి డైలాగ్ రైటర్ ను మారుస్తూ ఉంటాడు. అయితే ఈ సారి దేవా కట్టాతోనే SSMB29 మొత్తానికి డైలాగ్స్ రాయిస్తున్నాడట.

ఆద్యంతం అడ్వెంచరస్ బ్యాక్‌డ్రాప్ తో రూపొందుతున్న ఈ సినిమాకి డైలాగ్ రైటర్ గా దేవా ఎంపిక కావడంలో ఆయనకు ఉన్న ఇంగ్లీష్ లిటరేచర్ పరిజ్ఞానం కూడా ఒక కారణమై ఉండొచ్చు అని చెబుతున్నారు. ఇప్పటికే డైలాగ్ వెర్షన్ రాజమౌళికి అందించేసిన దేవా కట్టాకు ఈసారి ‘థ్యాంక్స్’ కార్డ్ మాత్రమే కాదు, సినిమాలో రచయితగా సరైన క్రెడిట్ కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News