సెకండ్ షెడ్యూల్ లో NC24
‘తండేల్’ విజయంతో ఫామ్‌లోకి వచ్చిన యూవసామ్రాట్ నాగ చైతన్య, ఇప్పుడు మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.;
‘తండేల్’ విజయంతో ఫామ్‌లోకి వచ్చిన యూవసామ్రాట్ నాగ చైతన్య, ఇప్పుడు మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇది చైతన్య కెరీర్ లో 24వ చిత్రం. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న NC 24, లేటెస్ట్ గా సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టుకుంది. హైదరాబాద్ లోనే మూడు ప్రధాన లొకేషన్స్ లో ఈ కీలక షెడ్యూల్ జరగనుందట. NC 24 సెకండ్ షెడ్యూల్ మొదలవుతోన్న సందర్భంగా విడుదలైన పోస్టర్‌లో నాగ చైతన్య చేతిలో ఒక ఆయుధం, తాడు పట్టుకుని ఏదో అన్వేషించడానికి బయలుదేరినట్టు కనిపిస్తుంది.
ఈ మూవీలో హీరోయిన్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్ష్ శ్రీవాత్సవ విలన్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.