కలెక్షన్లలో అజిత్ ను దాటేసిన నాగచైతన్య!

ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాలలో అజిత్ 'పట్టుదల' ఒకటి అయితే.. నాగచైతన్య 'తండేల్' మరొకటి. ఒకరోజు గ్యాప్ లో వచ్చిన ఈ రెండు సినిమాలలో అజిత్ సినిమాకి మిక్స్‌డ్ రివ్యూస్ దక్కగా.. 'తండేల్' తొలిరోజు నుంచే పాజిటివ్ రివ్యూస్ సంపాదించుకుంది.;

By :  S D R
Update: 2025-02-09 13:59 GMT

ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాలలో అజిత్ 'పట్టుదల' ఒకటి అయితే.. నాగచైతన్య 'తండేల్' మరొకటి. ఒకరోజు గ్యాప్ లో వచ్చిన ఈ రెండు సినిమాలలో అజిత్ సినిమాకి మిక్స్‌డ్ రివ్యూస్ దక్కగా.. 'తండేల్' తొలిరోజు నుంచే పాజిటివ్ రివ్యూస్ సంపాదించుకుంది.

తమిళంలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్న అజిత్ సినిమాని.. కలెక్షన్లలో నాగచైతన్య 'తండేల్' అధిగమించింది. 'తండేల్' చిత్రం తొలి రోజే రూ.11.5 కోట్లు (భారతదేశ వ్యాప్తంగా) వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా రూ.21.27 కోట్లు రాబట్టింది. నాగ చైతన్య కెరీర్‌లోనే హైయ్యస్ట్ ఓపెనింగ్ ఇది.

అజిత్ 'పట్టుదల' (విడాముయర్చి) సినిమా తొలి రోజు రూ.25 కోట్లు వసూలు చేసినప్పటికీ, రెండో రోజున వసూళ్లు భారీగా పడిపోయాయి. రెండో రోజు భారతదేశంలో కేవలం రూ.10 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఇక రెండో రోజు 'తండేల్' రూ.12.64 కోట్లు రాబట్టి అజిత్ సినిమాను మించి దూసుకుపోయింది. మొత్తంగా.. ఈ వీకెండ్ లోనే 'తండేల్' చిత్రం రూ.50 కోట్లు మార్కును దాటేయబోతుంది.

Tags:    

Similar News