తెలుగు తెరపై తిరిగి పౌరాణిక ప్రభంజనం!

తెలుగు సినిమా స్వర్ణయుగంలో పౌరాణికాలు రాజ్యమేలాయి. రామాయణం, మహాభారతం ఇతివృత్తాలతో వందల సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా నటరత్న ఎన్టీఆర్ నటించిన పౌరాణిక సినిమాలకు ఇప్పటికీ అభిమానులున్నారు.;

By :  S D R
Update: 2025-03-25 07:42 GMT

తెలుగు సినిమా స్వర్ణయుగంలో పౌరాణికాలు రాజ్యమేలాయి. రామాయణం, మహాభారతం ఇతివృత్తాలతో వందల సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా నటరత్న ఎన్టీఆర్ నటించిన పౌరాణిక సినిమాలకు ఇప్పటికీ అభిమానులున్నారు. ఒకప్పుడు ఎక్కువగా పౌరాణిక సినిమాలను రూపొందించిన తెలుగు చిత్ర కాలక్రమేణా వాటిని తగ్గించేసింది. పౌరాణిక కథలకు తగ్గ నటులు దొరకకపోవడం, అవి భారీ బడ్జెట్ తో కూడుకున్న సినిమాలు కావడం కూడా అందుకు ప్రధాన కారణం.

అయితే.. తెలుగులో మళ్లీ పౌరాణిక ట్రెండ్ కు తాము శ్రీకారం చుట్టబోతున్నామంటున్నారు నిర్మాత నాగవంశీ. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మించబోయే అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం పౌరాణిక కథతో రూపొందబోతుందని హింట్ ఇచ్చారు నాగవంశీ.

ఇప్పటివరకూ ఏ సినిమాల్లోనూ పెద్దగా చూపించనటువంటి పౌరాణిక కథతో తాము సినిమాని తీసుకురాబోతున్నామని ఓ ఇంటర్యూలో చెప్పారు నాగవంశీ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న అల్లు అర్జున్ -త్రివిక్రమ్ చిత్రం ఈ ఏడాది చివరిలో పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇప్పటికే బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు మంచి విజయాలు సాధించడంతో.. ఇప్పుడు రూపొందే నాల్గవ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Tags:    

Similar News