సీక్వెల్ లోనూ గొంతు సవరించిన క్రేజీ సింగర్ !
ప్రముఖ గాయని, పద్మభూషణ్ పురస్కార గ్రహీత.. ఉషా ఉతూప్ ఈ సినిమాలో పాట పాడడం విశేషంగా మారింది.;
మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో, ప్రధాన పాత్రల్లో నటించిన భారతీయ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘L2: ఎంపురాన్’. 2019 లో విడుదలైన ‘లూసిఫర్’ మూవీకి ఇది సీక్వెల్‌గా అని తెలిసిందే. మొదటి భాగం ముగిసిన చోటే ఈ కథ కొనసాగనుంది. తాజా అప్‌డేట్ ప్రకారం.. ఈ చిత్రానికి కొత్తగా ఒక ఆసక్తికరమైన అదనపు ప్రత్యేకత వచ్చి చేరింది.
ప్రముఖ గాయని, పద్మభూషణ్ పురస్కార గ్రహీత.. ఉషా ఉతూప్ ఈ సినిమాలో పాట పాడడం విశేషంగా మారింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఆమె ‘లూసిఫర్’ సినిమా కోసం ‘ఎంపురానే’ అనే సూపర్ హిట్ పాటను ఆలపించారు. ఇప్పుడు సీక్వెల్‌లో మరోసారి ఆమె గాత్రం వినిపించనుంది. దీంతో ‘ఎంపురాన్’ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి.
ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సంగీత దర్శకుడు దీపక్ దేవ్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉషా ఉతూప్‌తో కలిసి ఒక ఫొటో షేర్ చేశారు. "దీదీ మరోసారి రాక్స్...l2e" అని క్యాప్షన్ ఇచ్చారు. ‘కీచురాళ్ళు’ తెలుగు సినిమాలో ఉషా ఉతప్ టైటిల్ సాంగ్ పాడి అప్పట్లో సెన్సేషన్ గా మారారు. ఇప్పడు మలయాళంలో పాడిన పాటతో మరోసారి సెన్సేషన్ గా మారబోతున్నారు.