నా నెక్స్ట్ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే : ఉన్ని ముకుందన్
ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్ని ముకుందన్ కొందరు పిల్లలతో సరదా గడిపిన ఫోటోని పంచుకున్నారు.;
మాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ ఉన్ని ముకుందన్ తన తాజా చిత్రం 'మార్కో' విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధించింది. అయితే సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 'ఏ' రేటింగ్ ఇవ్వడంతో.. బాల ప్రేక్షకులు దీనిని వీక్షించలేకపోయారు. ఈ నేపథ్యంలో.. ఉన్ని ముకుందన్ సోషల్ మీడియా ద్వారా వారిని ఉద్దేశిస్తూ ప్రత్యేకమైన ప్రామిస్ చేశాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్ని ముకుందన్ కొందరు పిల్లలతో సరదా గడిపిన ఫోటోని పంచుకున్నారు. ఆ ఫోటోతో పాటు, ఒక నోట్ రాస్తూ.. తదుపరి సినిమా కుటుంబ ప్రేక్షకులకు తగినదిగా ఉండేలా చేస్తానని హామీ ఇచ్చాడు.
“'మార్కో'ను ఈ స్థాయిలో బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టినందుకు మీ అందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. నాకు అంత ప్రేమను అందించడంలో చిన్నారి ఫ్యాన్స్ ఎంతో సహాయపడ్డారు. 'ఏ' సర్టిఫికేషన్ కారణంగా చాలా కుటుంబాలు ఈ సినిమాను చూడలేకపోయారనే విషయం నాకు తెలుసు. మీ అందరికీ నా తదుపరి సినిమాతో ఈ లోటును తీర్చేందుకు ప్రయత్నిస్తాను. దయచేసి నా తదుపరి ప్రకటన కోసం వేచి ఉండండి.”
'మార్కో' ప్రపంచవ్యాప్తంగా రూ. 104 కోట్ల వసూళ్లు సాధించి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా, ఈ భారీ విజయంతో, ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోందని ప్రచారంలో ఉంది. చియాన్ విక్రమ్‌ను సీక్వెల్‌లో భాగస్వామ్యం చేయడానికి నిర్మాతలు పరిశీలిస్తున్నారని వార్తలొచ్చాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.